Wednesday, 22 August 2012

పరమహంస యోగానంద

పరమహంస యోగానంద
పరమహంస యోగానంద గారు - ఒక యోగి ఆత్మ కథ ద్వారా (ఈ పుస్తకం 17 బాషలలోకి అనువదించబడింది) ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రేమ పూర్వకమైన ఆధ్యాత్మిక పరిమళాలను వ్యాపింప చేస్తున్నారు.  భారతీయ ఆధ్యాత్మికతను పచ్చిమ దేశాల క్రైస్తవ ఆధ్యాత్మికతను సమ్మేళనం చేసి రెండు మతాల మధ్య మరింత సామరశ్యాన్ని పెంపొంధించ్చారు. 

మహావతార్ బాబాజి  గారు తన శిష్యులైన యోగావతార్ శ్రీ లాహిరి మహాశయుల ద్వారా  సామాన్య ప్రజలు కుడా పాటించ వీలైన " క్రియయోగాన్ని" మానవాళికి అందించారు. అర్హులై, త్రికరణ శుద్ధిగా చేసే సాధకుల ఆధ్యాత్మిక ప్రగతిని ఎంతో వేగవంతం చేసే ఈ " క్రియయోగాన్ని" లాహిరి శిష్యులైన జ్ఞానవతార్ శ్రీ యుక్తేశ్వరి గిరి గారు, అయన ప్రియ శిష్యులైన శ్రీ పరమహంస యోగానంద గారు ప్రపంచ వ్యాప్తంగా అర్హులైన శిష్యులందరికీ అందుబాట లోకి  తెచ్చారు. వీరు స్థాపించిన యోగద సత్సంగ్ సొసైటీ YSS (భారత దేశంలో) Self - Realization Fellowship (విదేశాలలో) ఆసక్తి కలిగిన వారిని క్రియయోగ కోర్సుకు సభ్యులుగా చేర్చుకుని ప్రతి 15 రోజులకు పాటాలు పంపిస్తూ, YSS తరపున వచ్చే స్వామీజీలు అడిగే ప్రశ్నలకు కోర్సు చేస్తున్న వారు సంతృప్తికర సమాధానాలు ఇచ్చాక వారికి  నిర్ణీత YSS కేంద్రంలో స్వామీజీ "క్రియయోగ దీక్ష" ఇస్తారు.

"క్రియయోగ దీక్ష" ఇచ్చే కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. ఇంతటి ప్రేమ పూర్వకమైన, ప్రశాంతతో కూడిన, ఆధ్యాత్మిక  సౌరభాలు విరజిమ్మే పవిత్ర కార్యక్రమం నేనైతే మరెక్కడా చూడ లేదు, విన లేదు. సత్వ గునాదిక్యత కలిగిన సాధకులకు ఈ దీక్షానుభుతి జీవితాంతం మరువలేని దివ్యానుభూతి. పూర్వ జన్మ సంస్కారాల వల్ల/ సత్పురుషుల సాన్గంత్యం వలన/ మహనీయుల ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము వలన ఇలాంటి ఆధ్యాత్మిక సత్సంగాలకు వెళ్ళే సదవకాశం కలుగుతుంది. 

జీవతం అంటే కేవలం మనము, మన తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, సంపాదన, ఇతరులతో ఆస్తి/అంతస్తుల పోటి, బంధు మిత్రాదులు వంటివి మాత్రమే కాదు. భారతీయ వేదాంతానికి మూల విరాట్టైన "కర్మ సిద్ధాంతం" ప్రకారం మనకు గత జన్మలు వున్నాయి, మళ్లీ జన్మలు వుంటాయి. ఈ జన్మలో సంపాదించిన బౌతిక పరమైన ఆస్తులు, హోదాలు, భార్య/భర్త బిడ్డలు, చివరకు మన బౌతిక శరీరం కుడా మరణం తర్వాత మన వెంట రావు. కాని వీటి కోసం, వీరి కోసం మనం చేసిన పాపపుణ్యాలు మాత్రం తప్పక మన వెంట జన్మ జన్మలకు వస్తాయి. చేస్తున్న పాపాలు భార్యాబిడ్డలుపంచుకోమని తేల్చి చెప్పాక దారి  దోపిడిలు చేస్తున్న వ్యక్తి " వాల్మికి" మహర్షి అయ్యాడు. మనకు అంత అవసరం లేదులే. కనీసం రవ్వంత ఆధ్యాత్మికతను మన జీవితంలోకి ఆహ్వానించి ముందుకు అడుగులు వేస్తే  చాలు. 

శుకబ్రహ్మాశ్రమం శ్రీ విధ్యప్రకశానందుల వారి "గీతామకరంధం",  శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద, ఆది శంకరులు,  యోగానందులు, వంటి మహనీయులు స్వానుభవంతో వ్రాసిన  ఆధ్యాత్మిక  పుస్తకాలు శ్రద్ధతో రోజుకో అరగంట చదవడం ఆరంబించడమే మొదటి అడుగు.

నా వ్యక్తి గత అభిప్రాయమైతే భగవద్గీత తర్వాత ప్రతి ఇంటా  ఉండవలసిన ఆధ్యాత్మిక పుస్తకం "ఒక యోగి ఆత్మ కథ", ఎందుకంటే ఇందులో పేర్కొన్న కొన్నిధ్యాన విషయాలు, విశ్వరూప దర్శనం, హిమాలయాల్లో ఎప్పటికి వుండే మహాయోగుల విషయాలు, సుక్ష్మ  లోక విషయాలు, గురు శిష్య సంభంధాలు మనకు మరెక్కడా కన్పించవు.

ఎవరికైనా ఈ పుస్తకం చదివాక డబ్బులు దండగయ్యాయి అనిపించితే పుస్తకం ధరకు రెట్టింపు ధర నేను మీ బ్యాంకు అకౌంటుకు జమ చేస్తాను. ఈలా వ్రాస్తున్నందుకు నన్ను మన్నించండి, నా తపన ఈ పుస్తకంలోని కొన్ని రహశ్యాలు పలువురికి తెలియాలని మాత్రమే.

మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము,  సంతోషం, ప్రశాంతత & దివ్యానందం  చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి     







     

No comments:

Post a Comment